తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ సినిమాని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడులో అన్నిచోట్లా ప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి అని అనుకుంటున్న టైంలో మాస్టర్ టీంకి పైరసీ రూపంలో ఓ కోలుకోలేని దెబ్బ తగిలింది.
జనవరి 11 నుంచి సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్ లో లీకైపోయాయి. దాంతో మాస్టర్ టీం మొత్తం పానిక్ అయిపొయింది. తమిళ ఇండస్ట్రీ మొత్తం పైరసీని ఎంకరేజ్ చేయద్దని, సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయమని చెబుతున్నారు. ఎంత లేదు అన్నా పైరసీ ఎఫెక్ట్ చివరి నిమిషంలో మాస్టర్ కి చాలా డామేజ్ చేసింది.
ఇంతకీ ఎవరు లీక్ చేశారా అనే విషయాలపై ఎంక్వైరీ చేయగా.. ఈ సినిమా ప్రింట్స్ రెండు రోజుల క్రితమే అన్ని థియేటర్స్ కి రీచ్ అయిపోయాయి. ఎస్.డి.సి థియేటర్స్ లో పనిచేసే ఉద్యోగి మాస్టర్ వీడియోస్ లీక్ చేసారని సమాచారం. అసలు పైరసీ జరగడానికి అతనే కారణం అని, అతనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి టీం సిద్ధమైంది.
ఆండ్రియా జేరేమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. మాస్టర్ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.