HomeTelugu cinema

నాని 28వ సినిమా టైటిల్ అంటే సుందరానికి
Published By :  Lasya Raghavaraju Image Image
Nani and Nazriya film titled Ante Sundaraniki
Saturday Nov 21, 2020
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. నాని 28వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కర్టెన్‌ రైజర్‌ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసి సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. 

ప్రచారంలో ఉన్నట్లుగానే ఈ చిత్రానికి 'అంటే సుందరానికీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ కర్టెన్‌ రైజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. హర్షవర్ధన్‌, సుహాస్‌ మధ్య ఏదో సీక్రెట్‌ డిస్కషన్‌ జరిగినట్లు చూపిస్తూ.. ఆసక్తికరంగా టైటిల్‌ 'అంటే సుందరానికీ' అని రివీల్‌ చేశారు. ఇందులో నాని లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకుని అటు తిరిగి నిలుచున్నాడు. పల్లెటూరి వ్యక్తిగా పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. 

నజ్రియా ఫహద్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని, 2021లో ఈ ఫన్‌ను ఎంజాయ్‌ చేయవచ్చునని ఈ కర్టెన్‌ రైజర్‌లో తెలిపారు. ఇంతకు ముందు తన సినిమాలో చూడని లవ్‌, నవ్వులను ఈ సినిమాలో చూస్తారంటూ నాని ట్వీట్‌ చేశారు.  

   Politics

   Lifestyle