HomeTelugu cinema

నాగశౌర్య సినిమాతో తెలుగు తెరపై మెరవనున్న షిర్లీ సేతియా
Published By :  Lasya Raghavaraju Image Image
Shirley Setia set to make Telugu debut opposite Naga Shourya
Saturday Nov 21, 2020
యువ కథానాయకుడు నాగ‌శౌర్య ప్రస్తుతం లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోన్న varudu కావలెను అనే సినిమాలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడి ఈ మధ్యనే పునఃప్రారంభం అయింది. శౌర్య సంతోష్ జాగర్లాపుడి దర్శకత్వంలో మరో స్పోర్ట్స్ డ్రామా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ శౌర ఆర్చర్ పాత్రలో కనిపించనున్నడని సమాచారం.

డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యానర్ పై ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. తాజా సమాచారం ప్రకారం ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా నటించనుంది. 
నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మ‌స్కా'తో న‌టిగా మారిన షిర్లీ, 'నిక‌మ్మా' చిత్రంతో బాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు. శౌర్య పక్కన కొత్తమ్మాయి అయితే బావుంటుందని షిర్లీని ఏమ్పికచేసారట.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

   Politics

   Lifestyle