HomeTelugu cinema

మహేష్ బాబు సర్కారు వారి పాట పూజతో ప్రారంభం
Published By :  Lasya Raghavaraju Image Image
Mahesh Babu Sarkaru Vaari Paata launched officially
Saturday Nov 21, 2020
సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా  పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ 'సర్కారువారి పాట' సినిమా శనివారం ఉదయం 11 గంటల 43 నిమిషాలకు హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 

సర్కారువారి పాట ముహూర్తపు సన్నివేశానికి సితార ఘట్టమనేని క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నిర్మాతలు స్క్రిప్ట్‌ను దర్శకుడు పరుశురాంకు అందించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది.  అలాగే స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో చేయనుందని తెలుస్తోంది. ఓ బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో స్వీటీ కనిపించనుందని టాలీవుడ్ టాక్. అలాగే అనిల్ కపూర్ విలన్‌గా, విద్యా బాలన్ మహేష్ సోదరిగా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందించనుండగా మధీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.  

మహేష్-పరశురాం కాంబినేషన్‌పై ప్రేకక్షాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.   ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటివారం నుండి అమెరికాలో ప్రారంభమవుతుంది. 

   Politics

   Lifestyle