HomeTelugu cinema

బాలీవుడ్‌లో 2 భారీ చిత్రాల్లో కథానాయికగా హైదరాబాద్‌ అమ్మాయి
Published By :  Divya Valluru Image Image
Hyderabadi Amreen qureshi bags two big projects in Bollywood
Saturday Nov 21, 2020
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తరాది కథానాయికలు హీరోయిన్లుగా ఎప్పటినుంచో నటిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే టాలీవుడ్ నాట వారిదే హవా. అతితే తెలుగమ్మాయిలు ముంబైకి వెళ్లి కథానాయికలుగా రాణిస్తున్నది  కొద్దిమందే. వారిలో టబు, దియా మీర్జా, అదితీరావు వంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి అమ్రిన్‌ ఖురేషి చేరుతున్నారు. 

డిస్ట్రిబ్యూటర్‌ ఎం.ఐ.ఖురేషీ మనవరాలు, ప్రొడ్యూసర్​ సాజిద్ ఖురేషీ కూతురే ఈ అమ్రిన్. అందంగా, అట్రాక్టివ్‌ గా ఉంటుంది. ఈ అమ్మడు బీటౌన్‌ లో రెండు సినిమా ఆఫర్స్ కొట్టేసిందట. రాజ్‌ తరుణ్‌ హీరోగా త్రినాథరావ్ నక్కిన తీసిన ‘సినిమా చూపిస్త మావ’ మూవీని ‘బ్యాడ్‌ బోయ్‌ ’గా రీమేక్ చేస్తున్నాడు రాజ్‌ కుమార్ సంతోషి. దీనిలో అమ్రిన్‌ హీరోయిన్‌ . వచ్చే యేడు సమ్మర్‌ లో రిలీజ్ చేసేందుకు నిర్మాత సాజిద్ ప్లాన్ చేస్తున్నారు. 

మరోపక్క ‘జులాయి’ మూవీ కూడా బాలీవుడ్‌ లో రీమేక్ కానుంది . టోనీ డిసౌజా దర్శకుడు. జనవరిలో షూటింగ్‌ మొదలు కానుంది . ఇందులో కూడా హీరోయిన్‌ గా చేస్తోంది అమ్రిన్. ఈ రెండు సినిమాల్లోనూ మిథున్ చక్రవర్తి కొడుకు నమషి హీరోగా నటిస్తున్నాడు.

   Politics

   Lifestyle