HomeTelugu cinema

అర్హ బర్త్‌డేకు బన్నీ స్టైలిష్ విషెస్‌ పోస్ట్ వైరల్
Published By :  Divya Valluru Image Image
Allu Arjun surprises daughter Allu Arha on her 4th Birthday
Saturday Nov 21, 2020
టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో అల్లు అర్జున్ ముందుంటాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కొడుకు, కూతురుతో ఇంట్లో సరదాగా గడుపుతుంటాడు బన్నీ. ముద్దుల తనయ అర్హతో చేసే అల్లరి చేష్టలు, ముద్దు ముద్దుగా మాట్లాడే వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఈ రోజు అల్లు అర్జున్ గారాల పట్టీ అర్హ పుట్టిన రోజు జరుపుకుంటోంది. 

అల్లు అర్జున్ , స్నేహా రెడ్డిలు 2011 మార్చి 6న పెళ్లి పీట‌లెక్క‌గా, వీరికి అయాన్, అర్హ‌లు జ‌న్మించారు. అయాన్ ఏప్రిల్ 3, 2014న జ‌న్మించ‌గా, అర్హ .. న‌వంబ‌ర్ 21, 2016న పుట్టింది.  అర్హ నాలుగేళ్లు పూర్తి చేసుకొని అయిదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తన కూతురికి బన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్‌ అర్హ. నీ క్యూట్‌నెస్‌, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్‌ ఏంజెల్‌’ అని కూతురికి గిఫ్ట్‌ ఇస్తున్న ఫోటోను ట్విటర్‌లో షేర్‌‌ చేశారు. కాగా ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా అర్హ పుట్టిన రోజు నాడు ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్‌ కటింగ్‌ జరిపించారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రైండింగ్‌గా మారాయి. 

సినిమాల విషయానికొస్తే ఈ యేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  మంచి విజయం సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన కనిపించనుంది.

   Politics

   Lifestyle