HomeTelugu cinema

పుష్ప నుంచి అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ లుక్‌ లీక్
Published By :  Lasya Raghavaraju Image Image
Allu Arjun shocking look as Pushparaj from Pushpa sets leaked
Friday Nov 20, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ర‌ష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగ‌నుంది. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్‌ వారు భారీ బడ్జెట్ తో ప్యాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం  షూటింగ్ ప్ర‌స్తుతం మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో జ‌రుగుతోంది. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న  ‘పుష్ప’ చిత్రంలో సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభం రోజున అల్లు అర్జున్ మారేడుమిల్లి అడ‌వుల్లోకి వెళుతున్న ఓ ఫొటోని చిత్ర బృందం షేర్ చేసింది. మాసిన ష‌ర్ట్ .. చేతికి 80ల కాలం నాటి వాచ్‌..వేలికి సిల్వ‌ర్ రింగ్..తో బ‌న్నీ పుష్ప‌రాజ్ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడా అనేంత‌గా ఆయ‌న మేకోవ‌ర్ క‌నిపించింది. 

తాజాగా బ‌న్నీ సెట్‌లో సంద‌డి చేస్తున్న ఓ ఫొటో బ‌య‌టికి వ‌చ్చేసింది. షాట్ గ్యాప్‌లో త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందితో వున్న బ‌న్నీ ఫొటో ఆయ‌న అభిమానుల‌కే కాదు ఆడియ‌న్స్‌కి కూడా షాకిస్తోంది. ఈ ఫొటోలో బ‌న్నీ ర‌గ్గ్‌డ్ లుక్‌లో మాసిన గ‌డ్డం.. మ‌ట్టి కొట్టుకు పోయిన డ్రెస్‌లో క‌నిపిస్తుండ‌టంతో ఈ ఫొటోలో వుంది బ‌న్నీ యేనా అని అవాక్క‌వుతున్నారు. త‌న స్టైల్స్‌ని ప‌క్క‌న పెట్టి పూర్తిగా పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ లీన‌మైన‌ట్టుగా ఈ లుక్‌ని బ‌ట్టి తెలుస్తోంది. 

   Politics

   Lifestyle