HomeTelugu cinema

కండలతో కుర్ర హీరోలకు షాకిస్తున్న శరత్ కుమార్
Published By :  Lasya Raghavaraju Image Image
Sarath Kumar latest gym pictures shocking netizens
Friday Nov 20, 2020
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ తెలుగువారికి కూడా పరిచయమే. బనీ, భరత్ అనే నేను సినిమాల్లో నటించిన ఈ ముదురు హీరో ఇపుడు కుర్ర హీరోలకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు.  శరత్‌కుమార్‌ 66 ఏళ్ల వయసులో బాడీ బిల్డింగ్‌తో అదర గొట్టేస్తున్నాడు. 

ఆరు పదుల వయస్సు దాటిన శరత్ కుమార్ కండలు చూపిస్తూ వెయిట్స్ ఎత్తుతున్న ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సహజంగానే బాడీ బిల్డర్‌ అయిన శరత్‌ కుమార్‌ లేటెస్ట్‌ జిమ్‌  ఫోటో వైరల్‌ అవుతోంది.  'నీ డెడికేషన్‌తో నన్ను షాకిస్తావు.. నాకు ఎంతో స్ఫూర్తినిస్తావు' అంటూ రాధికా శరత్‌కుమార్‌ కూడా ఫొటోపై కామెంట్‌ చేశారు. 

కాగా పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన  మలయాళ సూపర్ హిట్  మూవీ  'అయ్యపనమ్ కోషియం'  తమిళ రీమేక్‌లో  శరత్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో పృథ్వీరాజ్ పాత్రను శశికుమార్, శరత్ కుమార్ బిజు మీనన్ పాత్రను పోషించనున్నారని అంచనా. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌​ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

   Politics

   Lifestyle