HomeTelugu cinema

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఢిల్లీ సుందరి కేతిక శ‌ర్మ
Published By :  Lasya Raghavaraju Image Image
Delhi Beauty Ketika Sharma to romance NTR in Trivikram next
Friday Nov 20, 2020
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.  డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 

‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాలో తారక్ సరసన కథానాయికలుగా పూజా హెగ్డే, నివేధా పేతురాజ్, కియారా అద్వాణీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి.  అయితే సెకండ్ హీరోయిన్ కోసం కేతిక శ‌ర్మ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే త్రివిక్ర‌మ్‌ని  కేతిక శ‌ర్మ క‌లిసింద‌ట‌. సినిమాకు గ్లామ‌ర్ డోస్ అవ‌సం కాబ‌ట్టి సెకండ్ హీరోయిన్ గా కేతిక‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. కేతిక శ‌ర్మ‌ పూరి త‌న‌యుడు ఆకాష్ న‌టిస్తున్న `రొమాంటిక్‌` మూవీతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మించనున్న ఈ చిత్రం మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

   Politics

   Lifestyle