HomeTelugu cinema

చిరంజీవి ఆచార్య విలన్ గా అరవింద స్వామి
Published By :  Lasya Raghavaraju Image Image
Aravind Swamy to play villain in Chiranjeevi Acharya
Friday Nov 20, 2020
మెగా స్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనాతో నిలిచిన ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా పునఃప్రారంభమైంది. అయితే ఇంకా చిరు ఎప్పుడు షూట్‌లో జాయిన్‌ అవుతారనే దానిపై క్లారిటీ లేదు.

ఆచార్య మూవీలో ప్రతినాయకుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఇంతవరకు బయటకి రాలేదు. ఆచార్య కోసం దర్శకుడు కొంతమంది స్టార్‌ విలన్‌లను పరిశీలించగా చివరకు అరవింద్‌ స్వామిని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’లో హీరోకు, విలన్‌కు మధ్య ఉండే సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంట. దీంతో ప్రధాన విలన్‌గా అరవింద్‌ స్వామి కరెక్ట్‌గా సరిపోతారని భావించిన దర్శకుడు ఆయనను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు సినిమా యూనిట్‌ స్పష్టత ఇవ్వలేదు. 

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై  రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

   Politics

   Lifestyle