HomeTelugu cinema

గోవా అమ్మాయితో పెళ్ళికి సిద్దమైన అథర్వ
Published By :  Divya Valluru Image Image
Actor Atharva set to enter wedlock with his Goa girlfriend
Saturday Oct 17, 2020
తమిళ యువ హీరో అథర్వ మురళి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అధర్వ మురళి గోవాలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తెలుస్తుంది. ఆమెతో సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడట. ఆ అమ్మాయి ఎవరనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు, అయితే పెళ్ళి సమయానికి ఆమెను రివీల్ చేస్తారని టాక్.  

ఈమధ్యనే తన సోదరుడు ఆకాష్ మురళి పెళ్లి జరిగింది. దీంతో అధర్వ కూడా త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనే యోచనలో ఉన్నాడట. వచ్చే ఏడాది జనవరిలో తన ప్రేయసిని అథర్వ పెళ్లి చేసుకుంటాడట. ఈ మేరకు కోలీవుడ్ మీడియా వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. పెళ్లి వార్తలపై అథర్వ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. 

‘హృదయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని మెలిపెట్టిన మురళి కొడుకే అథర్వ.  నాన్నలాగే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి దగ్గరైన అధర్వ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన “గద్దలకొండ గణేష్” సినిమాలో నటించాడు.

   Politics

   Lifestyle