HomeTelugu cinema

మెగాస్టార్ స్టూడియో కల ఇప్పటికైనా ఫలిస్తుందా
Published By :  Divya Valluru Image Image
Megastar Chiranjeevi studio dream may come true
Saturday Oct 17, 2020
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ బ్రహ్మండమైన స్టూడియోను నిర్మించబోతున్నారనే వార్త  టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయనకు ఉన్న పదెకరాల స్థలంలో స్టూడియోను ప్రారంభించనున్నారు.  ఇందులో నాలుగు ఫ్లోర్లు, కాటేజీలు కూడా నిర్మిస్తారని అంటున్నారు.  ఇండోర్ షూటింగ్స్, టీవీ సీరియల్స్, రియాలిటీ షోస్, మినీ ఈవెంట్స్.. జరపుకునే వీలుగా ఈ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటి నుంచో ఫిల్మ్ స్టూడియో కట్టాలని ఉంది. గత కొంత కాలంగా దీని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే గతంలో ప్లానింగ్ దశలో ఆగిపోయినా ఈసారి అలా కాకుండా పక్కా ప్లాన్ తో రంగంలోకి చిరు దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి.  దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 

మరోవైపు, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ గండిపేటసమీపంలో అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్టూడియోను అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ పేరుతో భారీ స్టూడియో నిర్మిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇందులో సినిమాలకి, సీరియల్స్ కి సంబంధించిన చిత్రీకరణలకు ఉపయోగపడేలా భారీగా స్టూడియో ఉంటుందని తెలిపారు

   Politics

   Lifestyle