HomeTelugu cinema

డిసెంబర్ లో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చెప్పేసిన నాగబాబు
Published By :  Divya Valluru Image Image
Niharika Konidela destination wedding in December reveals Nagababu
Saturday Oct 17, 2020
మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల త్వరలో శ్రీమతిగా మారనుంది. గుంటూరుకు చెందినా జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కొన్నివారాల క్రితం వీరి నిశ్చితార్థం జరగగా డిసెంబర్‌లో పెళ్లి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్లపత్రికతో నాగబాబు మాట్లాడుతూ నిహారిక పెళ్లికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు.

నాగబాబు మాట్లాడుతూ నిహారిక పెళ్లి జరుగుతుండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను తన కుమారుడు వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని చెప్పారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నామని... డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని ప్రాంతాల పేర్లతో వరుణ్ ఒక లిస్ట్ తయారు చేశాడని చెప్పారు. వివాహం జరిగే తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తామని అన్నారు.

మరోవైపు మెగా ఫ్యామిలీలో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సాయి తేజ్ పెళ్లికి సంబంధించి చిరంజీవి కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

   Politics

   Lifestyle