HomeTelugu cinema

నితిన్ పవర్ పేటలో సత్య దేవ్ కీలక పాత్ర
Published By :  Divya Valluru Image Image
Actor Satya dev to play vital role in Nitin Powe Peta
Saturday Oct 17, 2020
టాలీవుడ్‌ యూత్ స్టార్ నితిన్‌ "భీష్మ" సినిమా విజయం తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం రంగ్‌దేతో పాటు చెక్ మూవీ‌లో నటిస్తోన్న నితిన్ ఆ తరువాత మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లలో నటించనున్నారు. అయితే ఈ ఇద్దరు దర్శకులు తెరకెక్కించే చిత్రాలు రీమేక్‌లు కావడం విశేషం. మేర్లపాక గాంధీ అంధధూన్‌ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తుండగా కృష్ణ చైతన్య పుదుపెట్టైని రీమేక్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే పుదుపెట్టై రీమేక్‌లో నితిన్ సరసన కీర్తి సురేష్‌ మరోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం టాలెంటెడ్‌ నటుడు సత్యదేవ్‌ని సంప్రదించినట్లు సమాచారం. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు పలువురు హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సత్యదేవ్‌. ఈ క్రమంలోనే పవర్‌ పేటలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవర్‌పేటకు సత్యదేవ్‌ మరో అదనపు ఆకర్షణ అవ్వనున్నారు.

మేర్లపాక గాంధీ అంధధూన్‌ రీమేక్‌, పవర్ పేట సినిమాలకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 

   Politics

   Lifestyle