HomeTelugu cinema

మంచు విష్ణు మోసగాళ్ళకు వెంకటేష్ గాత్రదానం
Published By :  Lasya Raghavaraju Image Image
Venkatesh voiceover to Manchu Vishnu-Kajal Mosagallu
Saturday Oct 17, 2020
జాఫ్రే గీ చిన్ ద‌ర్వ‌క‌త్వంలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో హాలీవుడ్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ గా రూపొందుతున్న తాజా చిత్రం మోసగాళ్లు.  భారీ ఐటీ స్కాం నేప‌థ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, న‌వ దీప్, రూహి సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీలో కాజ‌ల్‌, విష్ణు అన్నాచెల్లెలుగా తెర‌పై క‌నిపిస్తార‌ట‌. 

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న క్రాస్‌-ఓవర్‌ చిత్రమిది. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానున్నది.  ఇటీవల అల్లు అర్జున్‌ రిలీజ్‌ చేసిన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం ఓ విశేషమైతే, 'మోసగాళ్లు' టైటిల్‌ కీ థీమ్‌ మ్యూజిక్‌ను రిలీజ్‌ చేసిన వెంకటేష్‌, ఇప్పుడు తన వాయిస్‌ ఓవర్‌ను ఈ చిత్రానికి అందిస్తుండటం మరో విశేషం. ఈ సినిమా స్టోరీని ప్రారంభం నుంచి ముగింపు వరకు వెంకటేష్‌ నెరేట్ చేయనున్నారు.

ఈచిత్రానికి మ్యూజిక్‌: శ్యామ్‌ సి.ఎస్‌, సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ, ప్రొడక్షన్‌ డిజైన్‌: కిరణ్‌కుమార్‌ ఎం., ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజరుకుమార్‌ ఆర్‌., నిర్మాత: విష్ణు మంచు. వచ్చే ఏడాది ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

   Politics

   Lifestyle