HomeTelugu cinema

నటుడు రాజశేఖర్ కుటుంబానికి సోకిన కరోనా
Published By :  Divya Valluru Image Image
ACtor Rajasekhar Family tested positive for Corona
Saturday Oct 17, 2020
క‌రోనా మ‌హ‌మ్మారి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఎందరో నటీనటులు కరోనా బారిన పడ్డారు. అందులో కొందరు కరోనాను జయించగా మరికొందరు ఈ మందులేని రక్కసికి బలైపోయారు. తాజాగా యాంగ్రీ యంగ్‌మెన్ రాజ‌శేఖ‌ర్ కుటుంబం కూడా కరోనా బారిన ప‌డింది. రాజ‌శేఖ‌ర్  ట్విట్ట‌ర్ ద్వారా త‌న‌తో పాటు త‌న భార్య జీవిత‌, కుమార్తెలు శివాని, శివాత్మిక‌లు కరోనా సోకిన విష‌యాన్ని వెల్ల‌డించారు.

"నాకు, జీవితకు, పిల్లలకు కరోనా సోకిన మాట నిజమే. ప్రస్తుతం హాస్పిటల్‌లో చిక్సిత తీసుకుంటున్నాం.  శివాని, శివాత్మిక క‌రోనా నుండి కోలుకున్నారు . నేను, జీవిత ఇంకా చికిత్స తీసకుంటున్నాం. ఇప్పుడు మా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఇంటికొచ్చేస్తాం " అని రాజశేఖర్‌ ట్వీట్ చేసారు.

కాగా, దేశంలో కరోనా విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో సగటున 90 వేల కేసులు నమోదవగా, ఇప్పుడు 60 వేల కేసులు నమోదవుతున్యినాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. 

   Politics

   Lifestyle