HomeTelugu cinema

బాలకృష్ణ కోసం కేరళ బ్యూటీని దించుతున్న బోయపాటి
Published By :  Lasya Raghavaraju Image Image
Mallu actress Prayaga Martin to romance Balakrishna in BB3
Saturday Oct 17, 2020
'సింహా', 'లెజండ్' చిత్రాల తర్వాత ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడవ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య డబుల్ షేడ్ రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. అఘోరా పాత్ర ఒకటైతే మరో పాత్రలో బిజినెస్ మేన్ గా కనిపించనున్నారని గుసగుసలు వినిపించాయి. ఇందులో బాలయ్య సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారట. 

తాజా సమాచారం ప్రకారం  కేరళ బ్యూటీ  ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. మలయాళ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.  క్లాసికల్ డ్యాన్సర్, మోడల్‌ అయిన ప్రయాగ మార్టిన్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసి.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ మెరిసింది. తమిళంలో ‘పిశాచి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఉస్తాద్ హోటల్ మూవీలోనూ కనిపించింది. 

ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం లాక్ డౌన్ కి ముందు జరిగింది. ఇప్పుడు తదుపరి షెడ్యూలును ఈ నెలలోనే హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూలులో కథానాయిక ప్రయాగ మార్టిన్ కూడా జాయిన్ అవుతుందట.
సాహసం శ్వాసగా సాగిపో ఫేం మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా ఇంకా టైటిల్ నిర్ణయించాల్సి ఉంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

   Politics

   Lifestyle