HomeTelugu cinema

కీర్తి సురేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు
Published By :  Lasya Raghavaraju Image Image
Mahesh Babu sweet wish to Keerthy Suresh on her Birthday
Saturday Oct 17, 2020
సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో  సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా సినిమా 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించనుందన్న విషయాన్ని మహేశ్ కన్ఫార్మ్ చేశాడు. 

ఈ రోజు కీర్తి సురేశ్ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేశ్ ట్వీట్ చేస్తూ.. ‘గొప్ప టాలెంట్ ఉన్న కీర్తి సురేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. సర్కారు వారి పాట మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండి పోయే గొప్ప సినిమాగా నిలుస్తుంది’ అని చెప్పాడు.

మహేశ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కీర్తి సురేశ్ పోస్టు చేసింది. ‘థాంక్యూ మహేశ్ బాబు సర్. తొలిసారి మీతో కలిసి పనిచేయనున్నందుకు సంతోషంగా ఉంది.. దీని కోసం ఎదురు చూస్తున్నాను’ అని రిప్లై ఇచ్చింది. 

సోషల్ మెసేజ్‌తో కూడిన కథతో పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సర్కారు వారి పాట సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.

   Politics

   Lifestyle