HomeTelugu cinema

శ్రీముఖి కోసం క్రేజీ అంకుల్ గా సింగర్ మనో
Published By :  Sushma Paidipalli Image Image
Mano to play uncle to Sreemukhi in Crazy Uncles
Friday Oct 16, 2020
మ‌నీ ఫేం డైరెక్ట‌ర్ శివ‌నాగేశ్వ‌ర్దర్శకత్వంలో శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే వెబ్ మూవీ తెరకెక్కుతోంది. శ్రేయాస్ మీడియా నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ఈ చిత్రంలో ఎంతోమందిని అల‌రించిన సీనియ‌ర్ గాయ‌కుడు మ‌నో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. మ‌నో ఈ ప్రాజెక్టులో శ్రీముఖి అంకుల్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర‌యూనిట్ నుంచి క్లార‌టీ రావాల్సి ఉంది. మ‌రోవైపు ఈ చిత్రంలో ఇటీవ‌లే ప‌లాస చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో అల‌రించిన సింగ‌ర్ క‌మ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘుకుంచెతో పాటు రాజా ర‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రే సింగర్‌ మనో, సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు రాజా రవీందర్‌ అంకుల్స్‌ గా నటించబోతున్నారు.

రెగ్యులర్‌ కు చాలా విభిన్నంగా ఉండే ఈ క్రేజీ అంకుల్స్‌ డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు.  పే పర్‌ వ్యూ పద్దతిన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

   Politics

   Lifestyle