HomeTelugu cinema

కేజీఎఫ్ 2 అధీరా లుక్‌లోకి సంజ‌య్ దత్
Published By :  Sushma Paidipalli Image Image
Sanjay Dutt gearing up to join KGF 2 Adheera shoot
Friday Oct 16, 2020

బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ ఊపిరితిత్తుల క్యానర్స్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ముంబైలోనే సంజయ్‌ చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్‌ నివారణలో భాగంగా కీమోథెరపీ చికిత్సను తీసుకున్న సంజూ బాబా ఇటీవల చాలా వీక్ అయిపోయారు.  ఇటీవల సోషల్ మీడియాలో సంజయ్ లుక్ చూసి కూడా చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఆయన సన్నగా, క‌ళ్లు లోప‌లికి పోయి, నీరసంగా కనిపించడంతో అందరూ షాకయ్యారు. 

అయితే ఇప్పుడు సంజయ్ కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' చిత్రీకరణకు సిద్దమవుతున్నాడు. ఇందులో మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో  సంజయ్‌దత్‌ నటిస్తున్నారు. 'కేజీయఫ్ చాప్టర్ 2'లో అధీరా పాత్రకు సిద్ధమవుతున్నానంటూ సంజయ్ దత్ కొన్ని ఫొటోలతో ట్వీట్ కూడా షేర్ చేశారు.   రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. 

కాగా నవంబర్‌ నుండి సంజ‌య్ ద‌త్ ‘కేజీయఫ్‌ 2’ షూటింగ్ లో అడుగుపెడతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దాదాపు నెల రోజుల పాటు ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన షూటింగ్ ఉండ‌నుంది. సంజయ్ దత్ షూటింగ్ అయిపోతే దాదాపు సినిమా షూటింగ్ అయిపోయినట్టే అంటున్నారు చిత్రయూనిట్. కె.జి.ఎఫ్2 లో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు తెలుగు నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

   Politics

   Lifestyle