HomeTelugu cinema

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రముఖ యూట్యూబర్ 'క్యారిమినాటి'
Published By :  Divya Valluru Image Image
Ajay Nagar aka Carryminati set to enter Bigg Boss house
Wednesday Sep 16, 2020
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా బిగ్‌బాస్-14 (హిందీ) త్వరలో టీవీ ప్రేక్షకులను అలరించనుంది. బిగ్ బాస్ హిందీ 14 వ సీజన్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్ లో సందదిచేయబోయేది వీరేనంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఫైనలిస్టుల పేర్లు ఇంకా వెల్లడికాలేదు. 

తాజాగా ప్రముఖ యూట్యూబర్ అజయ్ నాగర్ బిగ్ బాస్‌లో పోటీదారుగా ఉండబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.   'క్యారిమినాటి' పేరుతో అజేయ్‌ నిర్వహించే యూట్యూబ్‌  ఛానల్‌కి  25 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.  అజయ్ ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ గడువు పూర్తయ్యాక అజయ్ బిగ్‌బాస్ హౌస్‌లో కాలు మోపనున్నారని సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. 

కాగా హిందీ బిగ్ బాస్ షో షూటింగ్ అక్టోబరు 1 నుంచి ముంబైలోని ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. అక్టోబరు 3 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో షోను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 

   Politics

   Lifestyle