HomeTelugu cinema

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్
Published By :  Lasya Raghavaraju Image Image
Mega Brother Nagababu tested positive for Corona virus
Wednesday Sep 16, 2020
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. . ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.  తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

రీసెంట్ గా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో నాగ‌బాబు కరోనా టెస్ట్ చేయించుకున్నాను, ఆ టెస్ట్ లో పాజిటివ్ అని తేల‌డంతో ప్ర‌స్తుతం హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాను.  కరోనా నుండి త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

ఇక ఆ ట్వీట్‌కు మెగాభిమానులు స్పందిస్తూ.. మీరు త్వరగా కోలుకోవాలి  దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని కామెంట్స్ చేశారు.

   Politics

   Lifestyle