HomeTelugu cinema

రానా-నాని హీరోలుగా సురేష్ బాబు భారీ మల్టీ స్టారర్
Published By :  Lasya Raghavaraju Image Image
Rana and Nani set to star in a big budget multi-starrer under Suresh Babu
Tuesday Sep 15, 2020
టాలీవుడ్ నాట మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.   ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ కలెక్షన్లు తెచ్చిపెడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓటీటీలో విడుదలైన నాని-సుధీర్ బాబు చిత్రం వి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక త్వరలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ రెడీ అవుతోంది. తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు మరో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట. 

ఫిలింనగర్లో వినిపిస్తున్న దాని ప్రకారం రానా దగ్గుబాటి, నాని, హీరోలుగా త్వరలో ఒక మల్టీ స్టారర్ రానుందట.  ఓ ప్రముఖ దర్శకుడు ఇప్పటికే వీరికి సూటయ్యే కథపై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దగ్గుబాటి రానా, నాని మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం వుంది. దీంతో వీరితో సినిమా చేస్తే అభిమానుల్లో మంచి అంచనాలు ఉంటాయని సురేష్ బాబు భావిస్తున్నాడు.   ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్లు కూడా టాప్ కేటగిరీ అమ్మాయిలే ఉంటారని సమాచారం

త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

   Politics

   Lifestyle