HomeTelugu cinema

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ ప్రారంభించిన పూజా హెగ్డే
Published By :  Lasya Raghavaraju Image Image
Pooja Hegde resumes Most Eligible Bachelor shoot in Hyderabad
Tuesday Sep 15, 2020
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే షూటింగ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. కరోనా మహమ్మారి వలన దాదాపు ఆరునెలలు ఇంట్లోనే కూర్చున్న పూజా మళ్ళీ కెమెరా ముందుకొచ్చింది. రెండురోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన పూజా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ లో పాల్గొంది. 

హైదరాబాదు అన్నపూర్ణ స్టుడియోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తన పాత్ర షూటింగ్ కోసం ఈరోజు సెట్స్ కి వచ్చిన పూజా తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంటు నందు ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో పూజా కారవాన్ దిగుతుండగా మరో ఇద్దరు పీపీఈ సూట్స్ ధరించి కనిపిస్తున్నారు.

అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో పూజా కథానాయికగా నటిస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 ప్రిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ సినిమాలో పూజా పాత్ర పేరు విభ. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

   Politics

   Lifestyle