HomeTelugu cinema

నారా రోహిత్ గడ్డం లుక్ పుష్ప కోసమేనా
Published By :  Lasya Raghavaraju Image Image
Nara Rohit shows his new Rugged look with Twitter DP
Tuesday Sep 15, 2020
నారా వారి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చి బాణం, సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెల్లో, అప్పట్లో ఒక్కడుండేవాడు లాంటి వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు దక్కించుకున్న నారా రోహిత్ తన ట్విట్టర్‌ ఖాతా ప్రొఫైల్‌లో పెట్టిన తాజా ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ ఫోటోలో రోహిత్ పొడవైన గడ్డంతో పాటు మీసాలతో కనిపిస్తున్నారు. దేనికోసమో తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   2018లో వచ్చిన ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రం తరువాత ఏ సినిమాలోనూ కనిపించలేదు రోహిత్. అయితే నారా వారబ్బాయి కొత్త లుక్ అల్లు అర్జున్  హీరోగా వస్తున్న పుష్ప మూవీ కోసమే అని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న పుష్పలో నారా రోహిత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరొయిన్ గా నటిస్తోంది. 

   Politics

   Lifestyle