HomeTelugu cinema

రాముడిపై అస‌భ్య‌క‌ర పోస్టుల కేసులో క‌త్తి మ‌హేష్ అరెస్ట్
Published By :  Divya Valluru Image Image
Kathhi Mahesh arrested by Cyber Crime police over Lord Ram posts
Friday Aug 14, 2020
సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ అరెస్ట్ అయ్యాడు. కొన్నిరోజుల క్రితం సోష‌ల్ మీడియా వేదిక‌గా శ్రీరాముడిపై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టినందుకు క‌త్తి మ‌హేష్ పై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో‌ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మ‌హేష్ ను అరెస్ట్ చేశారు.  ఉస్మానియా హాస్పిట‌ల్ లో వైద్య పరీక్షల త‌ర్వాత‌ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

కొన్ని వారాల క్రితం కత్తి మ‌హేష్ ఫేస్ ‌బుక్, ట్విటర్ ‌లో శ్రీరాముడి గురించి (రాముడు కరోనా ప్రియుడు) అసభ్యకర పోస్ట్ లు పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు క‌త్తి మ‌హేష్ పై పలు చోట్ల కేసులు పెట్టాయి. వారి ఫిర్యాదుల ఆధారంగా ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ​) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు కత్తి మహేష్ ‌ను విచారించారు. శుక్ర‌వారం మరోసారి విచారించిన పోలీసులు.. విచారణ త‌ర్వాత‌ ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఓసారి త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్యల కార‌ణంగా మహేష్ హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. 

   Politics

   Lifestyle