HomeTelugu cinema

సూర్య విజయ్ నేపోటిజం వల్లే స్టార్లయ్యారంటున్న మీరా మిథున్
Published By :  Lasya Raghavaraju Image Image
Vijay and Surya become stars due to Nepotism says Meera Mithun
Friday Aug 14, 2020
తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ మరో శ్రీ రెడ్డిలా మారాలనుకున్నట్లు ఉంది. మీరా తన సంచలన వ్యాఖ్యలతో కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే త్రిషపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. త్రిషకు కులపిచ్చి ఎక్కువని మండిపడింది. ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని చెప్పింది. తాజాగా మీరా మిథున్ కోలీవుడ్ అగ్ర హీరోలు సూర్య, విజయ్ లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కోలీవుడ్ లో నెపోటిజం (బంధుప్రీతి) వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని, అందువలనే వీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని విమర్శించింది. సినిమాల్లో విలన్లను ఉతికి ఆరేసే వీరికి సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా లేదని... చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని మండిపడింది. ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి. మీరా వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సైతం తప్పుపడుతున్నారు.

మీరా వ్యాఖ్యల పై సూర్య స్పందిస్తూ... తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలపై స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలని సూచించాడు. తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు.

   Politics

   Lifestyle