HomeTelugu cinema

దేవాక‌ట్ట ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ థీమ్‌ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌
Published By :  Lasya Raghavaraju Image Image
Devakatta Indraprastham Theme motion poster released
Friday Aug 14, 2020
ప్రస్థానం సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న దేవాక‌ట్ట తన తదుపరి సినిమాకి ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ అనే పేరు పెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ నారా చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.ఆర్ మ‌ధ్య స్నేహం, రాజ‌కీయ వైరం ఆధారంంగా రూపొందుతోన్న ఈ ఫిక్ష‌న‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ సినిమాకి సంబంధించిన థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఈ రోజు ఈ సినిమా బృందం యూనిట్ విడుద‌ల చేసింది.

'సాధార‌ణంగా ఓ కాంపీటీష‌న్ ప్ర‌ధాన ఉద్దేశం విజేత‌ను క‌నుక్కోవ‌డ‌మే. ఇద్ద‌రు స్నేహితులు ఓ పోటీలో పాల్గొన్న‌ప్పుడు అది చాలా ఆస‌క్తిక‌రంగా మారుతుంది’ అనే డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను దేవాక‌ట్ట వాయిస్ ఓవ‌ర్‌లో విడుద‌ల చేశారు. ఇందులో సీబీఎన్‌, వై.ఎస్‌.ఆర్‌ను పోలిన షేడ్ ఇమేజ్‌ల‌ను కూడా చూపించారు. ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ‌.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్ర‌స్తుతం సాయి తేజ్ హీరోగా దేవాక‌ట్ట ఒక సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన త‌ర్వాత ఇంద్రప్రస్థం సెట్స్ పైకి వెళుతుంది. 

   Politics

   Lifestyle