HomeTelugu cinema

నిఖిల్ తో జోడీకడుతున్న అనుపమ పరమేశ్వరన్
Published By :  Lasya Raghavaraju Image Image
Anupama Parameswaran to romance Nikhil in 18 Pages
Saturday Aug 01, 2020
అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన యువ హీరో నిఖిల్ డైరెక్టర్ పల్నాటి  సూర్యప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది.

18 పేజెస్ చిత్రంలో నిఖిల్ సరసన హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు.  ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అనుపమ కూడా నిఖిల్ తో జతకట్టేందుకు సుముఖంగానే ఉందట.

ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు.

   Politics

   Lifestyle