HomeTelugu cinema

ఎల్వీ ప్రసాద్ మనవడు బెదిరిస్తున్నాడంటూ ఇళ‌య‌రాజా ఫిర్యాదు
Published By :  Lasya Raghavaraju Image Image
Ilayaraja files police complaint against LV Prasad grandson
Saturday Aug 01, 2020
దివంగత దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ వారసులకు, లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మధ్య కొన్నిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎల్‌వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయిప్రసాద్ చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో ఉన్న ఇళయరాజా సూట్‌లో ఉన్న సంగీత వాయిద్య పరికరాలను ధ్వంసం చేసారని చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఇళయరాజా ఫిర్యాదు చేశారు.

సాయి, అతని మనుషులు కొద్దిరోజులుగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తద్వారా తన స్టూడియోను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇళయరాజా ఆరోపించారు. ఈ మేరకు ఆయన మేనేజర్ జాఫర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రసాద్ స్టూడియోలోని తన సూట్‌లోకి ప్రవేశించి మరీ సంగీత వాయిద్యాలు, నోట్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారని చెన్నై కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఇళయరాజా పేర్కొన్నారు. సాయి ప్రసాద్‌తో పాటు అతడి అనుచరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా కోరారు.

ప్ర‌సాద్ స్టూడియోస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాపై గౌర‌వంతో స్టూడియోలో ఓ ప్ర‌త్యేక‌మైన గ‌దిని కానుక‌గా ఇచ్చారు. ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళ‌య‌రాజా నాలుగు ద‌శాబ్దాలుగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఎల్‌.వి.ప్ర‌సాద్ త‌న‌యుడు ర‌మేశ్ ప్ర‌సాద్ ఈ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. కానీ మ‌న‌వ‌డు సాయిప్ర‌సాద్ మాత్రం తన తాత ఇళయరాజాకు ఇచ్చిన స్టూడియోను  ఆయన నుంచి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు.  దీంతో ఇళ‌యరాజా, ప్ర‌సాద్ స్టూడియో వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

   Politics

   Lifestyle