HomeTelugu cinema

టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ కి కార్తి ఖైదీ మూవీ
Published By :  Lasya Raghavaraju Image Image
Karthi's Khaidi selected for screening at Toronto International film festival
Saturday Aug 01, 2020
భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను కార్తి కథానాయకుడుగా దర్శకుడు లోకేష్‌ కనకరాజన్‌ తెరకెక్కించిన ఖైదీ చిత్రం ఎంపికైంది. విదేశీ విభాగంలో ఈ మూవీ పోటీ ప‌డుతున్న‌ది.

గతేడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ కథానాయిక, పాటలు లేకుండా కేవలం కథతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఎలాంటి కమర్షియల్ ఎంట్ర టైన్ మెంట్ లేకుండా మంచి కథ, సెంటిమెంట్, నటన ఈ చిత్రం విజయానికి ప్రధానాంశాలుగా నిలిచాయి. ఈ చిత్రంలో కార్తి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు లో సైతం ఈ చిత్రం మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది. అందుకే ఈ థ్రిల్‌ను హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి.

'ఖైదీ ’సినిమా తో పాటు హ్రితిక్ రోషన్ నటించిన  హిందీ చిత్రం‘సూపర్ 30’, నాని నటించిన "జెర్సీ' కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.

   Politics

   Lifestyle