HomeTelugu cinema

కన్నీటి పర్యంతమవుతూ వీడియో వదిలిన రియా చక్రవర్తి.
Published By :  Lasya Raghavaraju Image Image
Rhea chakraborty released video statement shedding tears
Saturday Aug 01, 2020
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు అతని గర్ల్  ఫ్రెండ్ రియా చక్రవర్తిదే.  సుశాంత్‌ను రియా చక్రవర్తి వేధింపులకు గురిచేసిందని, అతని దగ్గర నుంచి 15 కోట్ల రూపాయలు దోచుకుందని, రియా కారణంగానే సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. రియా పైన బిహార్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 

తన పై వస్తున్న ఆరోపణలపై రియా చక్రవర్తి ఒక వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేశారు. ఆమె తరఫు లాయర్‌ శుక్రవారం సాయంత్రం దాన్ని రిలీజ్‌ చేశారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ''నాకు దేవుడుపై న్యావ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి చాలా భయంకరంగా చెడు వార్తలు వస్తున్నాయి. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి నా లాయర్ సూచన మేరకు నేనేమీ మాట్లాడటం లేదు. సత్యమేవ జయతే. నిజం గెలుస్తుంది'' అని కన్నీరుపెడుతూ  చెప్పుకొచ్చింది.

రియా తన తరఫున ఈ కేసు వాదించడానికి ముంబైలో పేరు మోసిన లాయ‌ర్ స‌తీశ్ మాన్‌షిండేను ఎన్నుకుందట‌. రియా తరపున వాదించడానికి సతీష్ రోజుకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫీజు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

   Politics

   Lifestyle