HomeTelugu cinema

మాళవిక కోరికను వెంటనే తీర్చేసిన ధనుష్
Published By :  Dhanunjaya Vallivedu Image Image
Dhanush fulfils heroine Malavika Mohanan's desire
Saturday Aug 01, 2020
తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మాస్టర్ సినిమాలో హీరొయిన్ గా నటిస్తున్న మాళవిక మోహనన్ గత నెల 28న హీరో ధనుష్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలతో పాటుగా ఈ భామ ధనుష్ తో కలిసి నటించాలనే కోరికను బహిరంగంగా ప్రకటించింది. మాళవికకు సమాధానం ఇస్తూ నీ కోరిక త్వరలోనే తీరుతుంది అని ధనుష్ చెప్పాడు. ఇప్పుడు ధనుష్ తన మాటను నిలబెట్టుకున్నాడు. 

ధనుష్‌ హీరోగా కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ‘డీ43’ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసందే. ఈ సినిమాలో  హీరోయిన్‌గా మాళవికా మోహనన్‌ని తీసుకుంటామని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. దీంతో మాళవికా మోహనన్‌ కోరికను ధనుష్ వెంటనే తీర్చడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రజనీకాంత్ 'పేట' సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైన మాళవిక హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

   Politics

   Lifestyle