HomeTelugu cinema

డైరెక్టర్ శేఖర్ కమ్ములకి పితృవియోగం
Published By :  Divya Valluru Image Image
Director Sekhar Kammula father Seshaiah passed away at 89
Saturday Aug 01, 2020
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) మృతి చెందారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో భాదపడుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. శేషయ్య మరణవార్త  తెలియగానే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు శేఖర్ కమ్ములకి సంతాపం తెలియజేస్తున్నారు.

శేఖర్ కమ్ముల డాలర్ డ్రీమ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాకు ఆయనకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్నిచ్చింది. ఆ తవ్వాత గోదావరి, హ్యాపీ డేస్, అవకాయ్ బిర్యానీ, లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా చిత్రాలతో శేఖర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ''లవ్ స్టోరీ'' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది .

   Politics

   Lifestyle