HomeTelugu cinema

కరోనా ప్లాస్మా దాతలను సన్మానించిన విజయ్ దేవరకొండ
Published By :  Lasya Raghavaraju Image Image
Vijay Devarakonda fecilitates Corona Plasma donors with CP Sajjanar
Saturday Aug 01, 2020
యావత్ మాన‌వాళిని క‌బ‌లిస్తున్న క‌రోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలో ఆ వైర‌స్ ను జ‌యించ‌గ‌ల శ‌క్తి ఉంటుంద‌ని వైద్యులు నిర్థారించారు. కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి కూడా, అయినా కొంతమంది ముందుకు రావడంలేదు. తాజాగా కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్ ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..“పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కారోనా వచ్చింది.వారికి ప్లాస్మా అవసరం వచ్చింది..కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు.అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది.ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్ఫుజ్ ఉండేది.కానీ ఇప్పుడు donateplasma.scsc.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయితే చాలు. ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా.వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే.ఒకవేళ నాకు కారోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా” అని అన్నారు.

మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. "ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను..ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు.కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది. ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు.ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు.200 మంది పేషెంట్ ను కాపాడాము..ప్లాస్మా దానం చేసిన వారు కారోనా యోధులు..వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యత లో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలి” అన్నారు. 

   Politics

   Lifestyle