HomeTelugu cinema

మంచు మనోజ్ వియ్యంకుడిగా మారిన సాయి ధరమ్ తేజ్
Published By :  Lasya Raghavaraju Image Image
Manchu Manoj and Sai Dharam Tej pets date day
Monday Jun 29, 2020
టాలీవుడ్ యువ హీరోలు అందరూ చాలా స్నేహంగా ఉంటారు. మంచు మనోజ్ కూడా అందరితో చాల కలుపుగోలుగా ఉంటాడు. ముఖ్యంగా మెగా హీరోలతో మనోజ్ చాలా క్లోజ్. తాజాగా మనోజ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా వారి పెంపుడు కుక్కలు టాంగో, జోయాలతో కలిసి వెళ్లారు. 

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ.. ‘ఇది మా కుక్కలకు డేటింగ్ రోజు. నాకు మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్‌కు థాంక్స్. త్వరలోనే ముహుర్తాలు పెట్టి శుభలేక పంపిస్తాం. భౌతిక దూరం పాటిస్తూనే దీన్ని ఏర్పాటు చేశాం’ అంటూ వారిద్దరు ఉన్న ఫొటోను షేర్ చేసి చమత్కారించాడు. మనోజ్ ఫోటోకి నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. 

సినిమాల విషయానికి వస్తే మనోజ్ ఈ మధ్యనే అహం బ్రహ్మష్మి అనే సినిమా ప్రకటించాడు. సాయి తేజ్ సోలో ప్రతుకే సో బెటర్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. 

   Politics

   Lifestyle