HomeTelugu cinema

శేఖర్ కమ్ముల సినిమాకి ఊకొట్టిన వెంకటేష్
Published By :  Lasya Raghavaraju Image Image
Venkatesh gives his nod to star in Sekhar Kammula's next
Monday Jun 29, 2020
హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా వంటి ఫీల్ గుడ్ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టొరీ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకోగా కరోనా ప్రభావం వల్ల కుదరలేదు.

తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల త్వరలో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో జత కట్టనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని వెంకీకి శేఖర్ వినిపించడాని, వెంకీకి కూడా కథ బాగా నచ్చి ఒకే చెప్పాడని తెలుస్తోంది.. ఈ సినిమా కూడా శేఖ‌ర్ క‌మ్ముల‌ స్టైల్లోనే సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారట. 

వెంకీ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్న `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇందులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. 

   Politics

   Lifestyle