HomeTelugu cinema

వర్మ పవర్ స్టార్ సినిమాలో పవర్ స్టార్ ఇతనే
Published By :  Lasya Raghavaraju Image Image
RGV introduces lead actor from his movie Power Star
Monday Jun 29, 2020
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కాబోతున్న తన తదుపరి చిత్రం టైటిల్ 'పవర్ స్టార్' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి వర్మ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.‘పవర్‌ స్టార్‌’లో టైటిల్ పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను  విడుదల చేశాడు. 

‘నా కొత్త సినిమా పవర్‌ స్టార్‌లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’ అంటూ తన దైన శైలిలో ట్వీట్ చేశాడు వర్మ.  ఈ వీడియోను చూసి పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. 

ఈ లాక్‌డౌన్‌ కాలంలో క్లైమాక్స్‌, నగ్నం వంటి చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేసిన వర్మ మిర్యాలగూడ పరువు హత్యల నేపధ్యంలో మర్డర్‌ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. 

   Politics

   Lifestyle