HomeTelugu cinema

వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి పై కేసు నమోదు
Published By :  Ravi Koneri Image Image
Case filed against Vanitha Vijayakumar's third marriage
Monday Jun 29, 2020
తమిళ సీనియర్ నటుడు విజయ కుమార్ కూతురు, దేవి సినిమా హీరోయిన్ వనితా విజయ్  కుమార్‌ రెండు రోజుల క్రితం పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంటపై కేసు నమోదు అయింది. పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే ఈ పెళ్లి చేసుకున్నారని కేసు పెట్టడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

కాగా వనితా విజయ్ కుమార్ తన మొదటి భర్త ఆకాష్‌తో 2007లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకొని అక్కడ కూడా విడాకులు తప్పులేదు. తాజాగా ఈ నెల 27న పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో జరిగింది. కరోనా సమయం కావడంతో కుటుంబ సభ్యుల సమక్ష్యంలోనే ఇది జరిగింది. 

వనితా విజయ్  కుమార్ తన మూడో భర్తకు ముద్దులు పెడుతూ దిగిన ఫొటోలు వైరల్ కావడంతో ఇది చూసిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. 

   Politics

   Lifestyle