HomeTelugu cinema

కాల్చి చంపినా ఈ మృగాలలో మార్పు రావట్లేదే అంటూ హరీష్ ఆవేదన
Published By :  Ravi Koneri Image Image
Harish Shankar tweets about Kothagudem Devika rape and murder
Monday Jun 29, 2020
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనను అంత తేలిగ్గా మరువలేం. పశు వైద్యురాలైన దిశను నమ్మించి హత్యాచారం చేసిన నలుగురు దోషులను పది రోజుల్లోపే ఎన్‌కౌంటర్ చేయడం తో ఇలాంటి ఘటన మరోసారి జరగదని అంత అనుకున్నారు. కానీ ఇలాంటి ఎన్ కౌంటర్ లు ఎన్ని జరిగినా కామాంధులు మారరని కొత్తగూడెం ఘటనతో బయటపడింది.

కొన్ని రోజుల కింద కొత్తగూడెంలో దేవిక అనే 17 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆపై శవాన్ని రైల్వే ట్రాక్ దగ్గర పడేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు జస్టిస్ ఫర్ దేవిక అనే హ్యాష్ ట్యాగ్‌తో రైజ్ యువర్ వాయిస్ అంటూ దర్శకుడు హరీష్ శంకర్‌, హీరో విజయ్ దేవరకొండ, హీరో నితిన్‌లకు ట్వీట్ చేశారు.

దీనిపై హరీష్ శంకర్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ఎన్‌కౌంటర్ చేసినా బుద్ధి రావడం లేదు. అంటే ఇంకా పెద్ద పనిష్‌మెంట్ ఏదైనా ఆలోచించాలేమో’ అంటూ ట్వీట్‌ చేసాడు. నిజమే చావు కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది.. ఇలా కూడా మారకపోతే ఇంకేం శిక్ష వేయాలి అని ట్వీట్ చేసాడు. 

   Politics

   Lifestyle