HomeTelugu cinema

పవన్ కల్యాణ్ 'వ‌కీల్‌సాబ్' నుంచి లీకైన మరో సీన్
Published By :  Divya Valluru Image Image
Pawan Kalyan's Vakeek Saab court scene leaked on social media
Monday Jun 29, 2020
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వ‌కీల్‌సాబ్'. . బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు సంయుక్తంగా తెలుగు లో నిర్మిస్తున్నారు.  అంజ‌లి, నివేదా థామ‌స్  ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తయింది. 

అయితే మొదటి నుంచి వకీల్ సాబ్ సినిమాకి లీకుల దెబ్బ తగులుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్‌లో  పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్లు ఇందులో ఉంది. ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వాదనలు వినిపిస్తుండగా పక్కనే నటి అంజ‌లి కూర్చొని ఉంది. కోర్టులో వాదనలు వినడానికి వచ్చిన మరి కొందరూ ఇందులో కనపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది.

‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు దానికి తగ్గట్టుగానే షూటింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కరోనా రావడం తో అంత రివర్స్ అయ్యింది. ఈ క్రమంలో దిల్ రాజు 80 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ‘వకీల్ సాబ్’ ని కుదిరితే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. 

   Politics

   Lifestyle