HomeTelugu cinema

జెస్సీకి కార్తీక్‌ ఫోన్‌.. గౌత‌మ్ మీన‌న్ షార్ట్ ఫిల్మ్ మ్యాజిక్‌
Published By :  Divya Valluru Image Image
Gautham Menon short film Karthik dial setha yen goes viral
Friday May 22, 2020
క‌రోనా లాక్ డౌన్ దెబ్బకి ఇంట్లోనుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకపోవడంతో దర్శకులు కొత్త కొత్త‌గా ఆలోచిస్తున్నారు.  ఇంటి ప‌ట్టునే వుంటూ టెక్నాల‌జీతో కొత్త ఫీట్‌లు చేస్తున్నారు. తాజాగా ల‌వ్‌స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌతమ్ మీన‌న్ `కార్తీక్ డ‌య‌ల్ సేతా యెన్‌` పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ని రూపొందించారు. శింబు, త్రిష‌లు ఇందులో న‌టించారు. వీరిద్ద‌రూ క‌లిసి `ఏమాయా చేసావే`కు మాతృక అయిన‌టువంటి `విన్న‌యి తాండి వ‌రువాయా`లో న‌టించారు. తాజాగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లో శింబు కార్తీక్‌గా, త్రిష జెస్సీగా క‌నిపించారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిష‌కి కాల్ చేయ‌డ‌మే క‌థాంశం. వాళ్లిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నార‌న్న‌ది స‌న్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ ఎవ‌రి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి ఏఆర్ రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం అందించారు. 12 నిమిషాల 23 సెకండ్లతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కార్తీక్‌, జెస్సీల‌తో గౌత‌మ్ మీమ‌న్ మ‌ళ్లీ మ్యాజిక్ చేశార‌ని అంతా అంటున్నారు.

అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్‌ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.