HomeTelugu cinema

చైతూ ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు అంటూ సమంత పోస్ట్
Published By :  Lasya Raghavaraju Image Image
Samantha funny tweet on Naga chaitanya goes viral on Instagram
Friday May 22, 2020
గత కొంతకాలంగా ముంబై నేప‌థ్యంలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ కంప‌నీనీ ర‌న్ చేస్తున్న మిహీకా బ‌జాజ్ తో ల‌వ్‌లో ఉన్న నటుడు రానా ఆమెను త్వరలో పెళ్లిచేసుకోనున్నాడు.  ఈ నెల 12న త‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తి ఈమే అంటూ రానా మిహికాను ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా పరిచయం చేసాడు. భుదవారం రామానాయుడు స్టూడియోస్ నందు రానా, మిహీకాల నిశ్చితార్థం జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, కుటుంబ స‌భ్యులం అంతా ఫార్మ‌ల్‌గా రోకా వేడుక కోసం క‌లిశామ‌ని సురేష్ బాబు వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట కూడా పాల్గొంది. 

ఈ సంద‌ర్భంగా సామ్ ఇన్‌స్టాగ్ర‌మ్‌లో నాగ‌చైత‌న్య ఫొటోని షేర్ చేస్తూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది.  `అమ్మ, ఆంటీలు, చెల్లెల్లు, స్నేహితులు అంద‌రిని పంపిన త‌రువాత ఇప్పుడే ఇన్  స్టాగ్రామ్‌కు స‌మ‌యం చిక్కింది. నా భ‌ర్త చాలా హ్యాండ్స‌మ్‌గా వున్నాడు చూడండి. నా భర్త ప్రస్తుతం ఎక్కడో ఒక పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు` అంటూ సమంత కామెంట్ చేసింది.

భార్య చేసిన ఫన్నీ పోస్టుపై అంతే సరదాగా స్పందించాడు నాగచైతన్య. చూస్తుంటే ఇది ఇతరుల కలిసి చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని చైతు రిప్లై ఇచ్చాడు.  ప్ర‌స్తుతం సామ్ పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.