HomeTelugu cinema

“సత్యం వద ధర్మం చర…” ట్విట్టర్లో నాగబాబు మరో పోస్ట్
Published By :  Lasya Raghavaraju Image Image
Nagababu another post on Twitter goes viral on social media
Friday May 22, 2020
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీని చంపినా గాడ్సేపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ నాగబాబు ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ ఓయూ పీఎస్‌లో నాగబాబుపై ఫిర్యాదు చేశారు. గాంధీని కించపర్చేలా పోస్టు పెట్టారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఈ నేపధ్యంలో నాగబాబు మరోసారి ట్విట్టర్ వేదికగా మరో ఆసక్తికర పోస్ట్ రాసారు. 

‘సత్యం వద ధర్మం చర.. అంటే (speak the truth.. live the righteous life) నిజం మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి అని అర్థం. కానీ, ఎవరో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యంగ్యంగా అన్న మాట.. సత్యం వధించబడింది.. ధర్మం చెరసాల పాలైనది అన్నారు. వ్యంగ్యంగా అన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది’ అని నాగబాబు ట్వీట్ చేశారు. 

మే 19న మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు ఆయనను పొగుడుతూ ట్వీట్ చేసారు. ‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.