HomeTelugu cinema

కరోనా మాస్క్ తప్పనిసరి అంటూ మహేష్ బాబు ప్రచారం
Published By :  Lasya Raghavaraju Image Image
Mahesh Babu tweets his photo wearing Corona mask
Friday May 22, 2020
ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని కూడా వణికిస్తున్న కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను టాలీవుడ్ ప్రముఖులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కరోనా నివారణకై మార్గదర్శకం అవుతోంది.

కరోనా లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతూనే సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నాడు మహేష్. తాజాగా  మాస్క్ ధరించి ఫోట్ షేర్ చేసిన మ‌హేష్‌..."ఇప్పుడిప్పుడే మ‌నం క‌రోనా బారి నుండి త‌ప్పించుకుంటున్నాం. బ‌య‌ట‌కి వెళ్ళేటప్పుడు త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించాలి. ఇందువ‌ల‌న మ‌న‌తో పాటు మ‌న చుట్టు ఉన్న‌వారిని కూడా కాపాడిన వార‌వుతాం. నేను మాస్కు ధరించాను.. మరి మీరు?''  అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక మ‌రో ట్వీట్‌లో మాస్క్ ధ‌రించడం కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కాని ఇలాంటి ప‌రిస్థితుల‌లో మాస్క్ ధ‌రించడం త‌ప్ప‌దు.  పాత రోజులు తిరిగి పొందాలంటే మాస్క్ ధ‌రించ‌డం ఒక్క‌టే మ‌న‌కి మార్గం అని చెప్పుకొచ్చాడు.