HomeTelugu cinema

ఉగాది రోజున ట్విట్టర్ ఖాతా తెరిచిన మెగాస్టార్
Published By :  Ravi Koneri Image Image
Megastar Chiranjeevi opens his official Twitter account ; first tweet on Corona
Wednesday Mar 25, 2020
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు మరిచిపోలేని కానుక ఇచ్చారు. ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించారు. ఆయన రెండు ట్వీట్లు చేశారు. ఇప్పటికే ఆయన ఇన్ స్టాగ్రామ్ లోనూ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.  'చిరంజీవి కొణిదెల' అనే పేరుతో ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ప్రారంభించారు. 

‘అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులతో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం.’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

మెగాస్టార్ చేసిన తొలి ట్వీట్ ను రీట్వీట్‌ చేస్తూ పలువురు హీరోలు ఆయనకు సామాజిక మాధ్యమాల్లోకి స్వాగతం పలికారు. చిరుకి స్వాగతమని, ఆయన చెప్పే మాటలు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. అలాగే చాలా మంది టాలీవుడ్‌ హీరోలు చిరు ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు.

   Politics

   Lifestyle