HomeTelugu cinema

రాజమౌళి 'రౌద్రం.. రణం.. రుధిరం' మోషన్ పోస్టర్
Published By :  Ravi Koneri Image Image
Rajamouli's RRR titled Roudram Ranam Rudhiram ; motion poster out
Wednesday Mar 25, 2020
దర్శకదీరుడు యస్ యస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి  'రౌద్రం.. రణం.. రుధిరం' అనే పేరు పెట్టారు. ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను  ఆ సినిమా బృందం విడుదల చేసింది.  పలు భాషల్లో ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను విడుదల చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్లు సోషల్  మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

టాలీవుడ్‌ హీరోలు రామ్ చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఒలివియా మోరిస్, అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్గన్, సముతిరకని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు మరోవైపు తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు. 

ఈ సినిమా టైటిల్ పై ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి.  వాటన్నింటికీ రాజమౌళి నేటితో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తోన్న ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

   Politics

   Lifestyle