HomeTelugu cinema

కళ్యాణ్ దేవ్ సరసన అవికా ఘోర్
Published By :  Ravi Koneri Image Image
Avika Gor to romance Kalyan Dev in Sreedhar Seepana;s next
Tuesday Mar 24, 2020
చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా కళ్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తన రెండో చిత్రం సూపర్ మచ్చి పై కళ్యాణ్ దేవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే, పులి వాసు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ స్టార్ హీరోయిన్ ర‌చితా రామ్ ను కథానాయికగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

సూపర్ మచ్చి సినిమా తరువాత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఉయ్యాలా జంపాల ఫేం అవికా గోర్ ఎంపిక అయినట్లు సమాచారం.  చిన్నారి పెళ్లి కూతురిగా టెలివిజన్ తెరకు పరిచయమైన అవికా ఉయ్యాలా జంపాలా సినిమాతో యూత్ గుండెల్లో పాగా వేసింది. రాజ్ తరుణ్‌తో 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయిని చూసి ఇక తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగులో గ్యాప్ తీసుకుంది. ఈ మధ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది 3' లో మెరిసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవికాను ఎవరూ పట్టించుకోలేదు.   ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ దేవ్ పక్కన నటించే అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. 

కళ్యాణ్ - అవికా సినిమా గురించి పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది.

   Politics

   Lifestyle