HomeTelugu cinema

కన్నడ సినీ నిర్మాత కపాలి మోహన్ ఆత్మహత్య
Published By :  Lasya Raghavaraju Image Image
Kannada producer Kapali Mohan commits suicide by hanging
Tuesday Mar 24, 2020
ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, వ్యాపారవేత్త వికె మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని పీన్యా ప్రాంతంలోని తన సొంత హోటల్‌లోనే ఆయన సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్‌కుమార్‌ బంధువైన కపాలి మోహన్ ఆత్మహత్య ఘటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. గంగమ్మగుడి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో మోహన్‌ సుప్రీం అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈయన అక్కడనే ఉన్న సదాశివ నగర్‌లో నివసిస్తున్నాడు.  ఆదివారం రాత్రి మోహన్‌ తన స్నేహితుడైన మంజునాథ్ తో కలిసి భోజనం చేసాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హోట‌ల్ రూమ్‌కు వెళ్లారు. ఆ తర్వాత మంజునాథ్ గాడ నిద్రలో ఉండగా మోహన్ ఆయనకు తెలియకుండా ఉరివేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అంతకు ముందు ఆయన తన కొడుకుతో ఫోన్‌లో వీడియో కాల్ చేసి మాట్లాడారు.

సీఎం, డీసీఎం లక్ష్మణ సవదికి విన్నపం చేస్తూ తనకు హోటల్లో తీవ్ర నష్టం వచ్చిందని, వేరే దారిలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ మృతదేహాన్ని ఎమ్ఎస్ రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. 

మోహన్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. అంతేకాదు ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

   Politics

   Lifestyle