HomeTelugu cinema

కంచి మఠం వారికి ఇల్లు దానం చేసిన బాలు
Published By :  Divya Valluru Image Image
SP Balasubramanyam donated his ancestral house to Kanchi Mutt
Friday Feb 14, 2020
టాలీవుడ్‌ లెజెండరీ సింగర్ ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం తన సొంతింటిని కంచి మఠం వారికి విరాళంగా అందించి వార్తల్లో నిలిచారు. బాలు స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న ఇంటిని కంచి పీఠానికి దానం చేశారు. ఈ ఇంటిలో బాలు తండ్రి ఎస్పీ సాంబమూర్తి పేరుతో వేద పాఠశాలను నిర్వహించనున్నారు.  

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ..’మా నాన్న గారు పెద్ద శైవభక్తులు. గురుభక్తితో ఉండే వారు. వారులేరనే అసంతృప్తి తప్ప వారిపేరుతో వేద పాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తాం. కంచి పీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదు.. భగవత్‌ సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబు’ అని అన్నారు

రెండు రోజుల క్రితం ఆ ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో బాలు స్వయంగా కంచి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామికి ఇంటిని అప్పగించారు. 

కాగా, వేద పాఠశాల నిర్వహణకు తన సొంత ఇంటిని దానం చేసిన బాలుపై నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల కురిపిస్తున్నారు.


   Politics

   Lifestyle